వెంగసర్కార్ కు సీకే నాయుడు పురస్కారం | BCCI to honour Vengsarkar with Lifetime Achievement award | Sakshi
Sakshi News home page

వెంగసర్కార్ కు సీకే నాయుడు పురస్కారం

Nov 18 2014 2:12 PM | Updated on Sep 2 2017 4:41 PM

దిలీప్ వెంగసర్కార్(ఫైల్)

దిలీప్ వెంగసర్కార్(ఫైల్)

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ దిలీప్ వెంగసర్కార్- కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు.

ముంబై: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగసర్కార్- కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. బీసీసీఐ 8వ వార్షిక అవార్డులను మంగళవారం ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్, కార్యదర్శి సంజయ్ పటేల్ తో కూడిన కమిటీ వెంగసర్కార్ ను అవార్డుకు ఎంపిక చేసింది.

పురస్కారం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ. 25 లక్షల నగదు అందజేయనున్నారు. 58 ఏళ్ల వెంగసర్కార్ 1976 నుంచి 1991 వరకు భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. భువనేశ్వర్ కుమార్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. నవంబర్ 21న అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement