ఐపీఎల్‌తో ఎంత ఆదాయమో తెలుసా?

BCCI earns 2000 crores with IPL  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇప్పుడు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం 2018-19 మధ్యకాలంలో సుమారు రూ. 2,017 కోట్ల మిగులు ఆదాయాన్ని బీసీసీఐ ఆర్జించనుంది. 

ఇక బోర్డుకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు, అంతర్జాతీయ, దేశీయ మ్యాచుల ద్వారా కేవలం రూ.125 కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా వచ్చే ఆదాయం రూ.3,413 కోట్లు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ బోర్డు ఆదాయంలో ఐపీఎల్‌ వాటా సుమారు 95 శాతానికి పైమాటే. గతేడాది ఇది 60 శాతం మాత్రమే ఉంది. ఈ లెక్కన్న ఏడాదిలో బీసీసీఐకి వచ్చే ఆదాయం కన్నా.. 45 రోజుల పాటు కొనసాగే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం 16 రెట్లు అధికంగా ఉందన్న మాట. 

ప్రసార హక్కుల కోసం స్టార్‌ ఇండియాతో సుమారు 16, 347 కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం మూలంగానే ఇది అమాంతం పెరగటానికి కారణమని చెప్పుకొవచ్చు. ఇక మొత్తం ఆదాయంలో.. క్రీడా సదుపాయాలు, ఇతరత్రా వాటికి బీసీసీఐ రూ.1,272 కోట్లను ఖర్చు చేయనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top