జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది.
ఢాకా: జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 38 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాలర్ (31 బంతుల్లో 68; 4 ఫోర్లు; 6 సిక్సర్లు) వేగంగా ఆడి స్కోరును ఉరకలెత్తించాడు. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన తను జింబాబ్వే తరఫున టి20ల్లో వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడయ్యాడు.
మొర్తజా, అమిన్, ముస్తఫిజుర్, జుబేర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు), మహ్ముదుల్లా (31 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. క్రెమెర్‌కు మూడు, కిసోరోకు రెండు వికెట్లు దక్కాయి.