క్రికెటర్ల హోటల్ గదిలో అమ్మాయిలు! | Bangladesh Cricket Board fines players for female guests in hotel rooms | Sakshi
Sakshi News home page

క్రికెటర్ల హోటల్ గదిలో అమ్మాయిలు!

Dec 1 2016 3:02 PM | Updated on Oct 2 2018 4:31 PM

క్రికెటర్ల హోటల్ గదిలో అమ్మాయిలు! - Sakshi

క్రికెటర్ల హోటల్ గదిలో అమ్మాయిలు!

ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్లు ఇరకాటంలో పడ్డారు.

ఢాకా: ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్లు ఇరకాటంలో పడ్డారు. తమ హోటల్ గదికి అమ్మాయిల్ని అతిథులుగా తీసుకురావడంతో బంగ్లాదేశ్ పేస్ బౌలర్ అల్ అమిన్ హుస్సేన్, బ్యాట్స్మన్ షబ్బిర్ రెహ్మాన్ లపై భారీ జరిమానా పడింది.  బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) ట్వంటీ 20 టోర్నీ జరిగే క్రమంలో అమిన్ హుస్సేన్, షబ్బిర్ రెహ్మాన్ హోటల్ గదిలో అమ్మాయిలు దర్శనమిచ్చారు.

 

ఈ విషయాన్ని మంగళవారం రాత్రి అధికారికంగా ధృవీకరించిన బీసీబీ.. ఆ ఇద్దరికి దాదాపు 15 వేల డాలర్ల (రూ.10లక్షల) భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. కాగా, ఆ ఇద్దరిపై ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోకుండా  గట్టి హెచ్చరిక చేసింది.  భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతమైన పక్షంలో తీవ్రమైన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది.

ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ సీజన్లో ఏడు ఫ్రాంచైజీ  జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో బారిసాల్ బుల్స్ తరుపున అల్ అమిన్ ఆడుతుండగా, రాజ్షాయ్ కింగ్స్ కు షబ్బిర్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే వారు ఆమ్మాయిల్ని గదికి పిలుపించుకోవడం బీసీబీలో అలజడి రేగింది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన బీసీబీ.. వారికి భారీ జరిమానా కూడిన శిక్షణను అమలు చేసింది.  జాతీయ స్థాయి క్రికెటర్లు ఈ రకంగా ప్రవర్తించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆ మేరకు బీసీబీ చర్యలు చేపట్టింది. ఈ సీజన్ అమీన్ బీపీఎల్ కాంట్రాక్ట్ ఫీజులో 50శాతం కోత విధించిన బీసీబీ.. షబ్బిర్ కాంట్రాక్ట్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement