ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ వారియర్స్‌ను దెబ్బతీసింది.
నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ వారియర్స్‌ను దెబ్బతీసింది. బుధవారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో బెంగళూరు 31–25తో వారియర్స్‌పై గెలిచింది. బెంగళూరు తరఫున రైడర్ అజయ్ కుమార్ అద్భుతంగా ఆడాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అజయ్ 8 పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ ఆశిష్ కుమార్ (5) టాకిల్‌లో అదరగొట్టాడు. టాకిల్ చేసిన ఐదు సార్లు పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో రోహిత్ కుమార్ 6, రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ చెరో 2 పాయింట్లు చేశారు.
బెంగాల్ వారియర్స్ జట్టులో జాంగ్ కున్ లీ 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 8 పాయింట్లు సాధించగా... టాకిల్‌లో సుర్జీత్ సింగ్ (4) ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. లీగ్‌లో బుల్స్‌కు ఇది మూడో విజయం కాగా బెంగాల్‌కు తొలి పరాజయం.
నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను ‘స్టార్ స్పోర్ట్స్–2’ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.