శ్రీకాంత్ కు రూ.5 లక్షల ప్రైజ్ మనీ | BAI announces Rs.5 lakh award for Srikanth | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ కు రూ.5 లక్షల ప్రైజ్ మనీ

Mar 16 2015 8:40 PM | Updated on Sep 2 2017 10:56 PM

స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న హైదరాబాద్ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్ కు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) రూ.ఐదు లక్షల ప్రైజ్ మనీ అవార్డును అందజేయనుంది.

న్యూఢిల్లీ: స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న హైదరాబాద్ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్ కు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) రూ.ఐదు లక్షల ప్రైజ్ మనీ అవార్డును అందజేయనుంది.  ఈమేరకు సోమవారం బాయ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

 

' స్విస్ ఓపెన్ లో శ్రీకాంత్ ప్రదర్శన ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి వారికి తగిన రివార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే శ్రీకాంత్ కు ప్రైజ్ మనీ ఇవ్వనున్నాం' అని బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. శ్రీకాంత్ తాజా విజయంతో మార్చి 24 నుంచి ఆరంభం కానున్న ఇండియా ఓపెన్ లో అతనిపై ఆశలు మరింత పెరిగాయన్నాడు.

 

ఆదివారం ఇక్కడ జరిగిన స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్ విజయం సాధించి టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ 21-15, 12-21, 21-14 తేడాతో డెన్మార్క్ కు చెంది విక్టోర్ అలెక్సన్ ఓడించి స్విస్ ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement