
అడిలైడ్: పక్క టెముకల గాయంతో బాధ పడుతున్న ఆస్ట్రేలియా వన్డే, టి20 సారథి అరోన్ ఫించ్ శ్రీలంకతో జరిగే తొలి టి20కి ఫిట్‌నెస్ సాధించాడు. తాను ఫిట్‌గా ఉన్నానని ఆదివారం జరిగే మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగనున్నట్లు ఫించ్ శనివారం తెలిపాడు. అయితే టి20 డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరుతెచ్చుకున్న అండ్రూ టై మాత్రం మోచేతి గాయం కారణంగా శ్రీలంకతో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తొలిసారి పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతున్నారు.