
మెల్‌బోర్న్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న అలజడి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీస్, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం ప్రజల్ని కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి సేవకు ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా మద్దతు తెలిపాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తోన్న వారికి సంఘీభావంగా వార్నర్ ట్రిమ్మర్ సహాయంతో స్వయంగా గుండు గీసుకున్నాడు. జుట్టును షేవ్ చేసుకుంటున్న వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వార్నర్... మరో ఎనిమిది మందికి ఈ చాలెంజ్‌ను విసిరాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కమిన్స్, జో బర్న్స్, స్టొయినిస్, జంపా కూడా ఉన్నారు.