ద్యుతీకి ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహకం | athlete Dutee Chand supported by odisha government | Sakshi
Sakshi News home page

ద్యుతీకి ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహకం

Jul 27 2016 11:39 AM | Updated on Sep 4 2017 6:35 AM

ద్యుతీకి ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహకం

ద్యుతీకి ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహకం

స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో సహా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తమ అథ్లెట్లకు ఒడిశా ప్రభుత్వం తలా రూ. 10 లక్షల ప్రత్యేక ప్రోత్సహకాన్ని ప్రకటించింది.

ద్యుతీచంద్‌కు రూ. 10 లక్షలు
భువనేశ్వర్: స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో సహా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తమ అథ్లెట్లకు ఒడిశా ప్రభుత్వం తలా రూ. 10 లక్షల ప్రత్యేక ప్రోత్సహకాన్ని ప్రకటించింది. ఒడిశా నుంచి ఇద్దరు స్ప్రిం టర్లు, నలుగురు హాకీ క్రీడాకారిణిలు రియోకు అర్హత సాధించారు.

స్ప్రింటర్ శర్బానీ నందా, హాకీ ప్లేయర్లు దీపా, నమితా, లిలిమా, సునీతా లక్రా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (ఓఎమ్‌సీ) కూడా తలా రూ. 10 లక్షల పురస్కారాన్ని అందజేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement