లలిత్ గేమ్ డ్రా | Asian Continental Open Chess Championship:- Lalit game Draw | Sakshi
Sakshi News home page

లలిత్ గేమ్ డ్రా

May 28 2016 1:49 AM | Updated on Sep 4 2017 1:04 AM

ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి ‘డ్రా’.....

తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. బిల్‌గున్ సుమియా (మంగోలియా)తో శుక్రవారం జరిగిన రెండో గేమ్‌ను లలిత్‌బాబు ‘డ్రా’గా ముగించాడు.

ఇదే టోర్నమెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష రెండో పరాజయాన్ని చవిచూసింది. ఎన్గుయెన్ థి మాయ్ హంగ్ (వియత్నాం)తో జరిగిన రెండో రౌండ్‌లో ప్రత్యూష 44 ఎత్తుల్లో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement