క్వార్టర్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి జంట | Ashwini And Sikki Reddy in quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి జంట

Mar 15 2019 4:21 AM | Updated on Mar 15 2019 4:21 AM

 Ashwini And Sikki Reddy  in quarterfinals - Sakshi

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్  బ్యాడ్మింటన్  టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అశ్విని పొన్నప్పతో కలిసి మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న సిక్కిరెడ్డి.... మిక్స్‌డ్‌ డబుల్స్‌తో ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయింది. గురువారం మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 21–14, 21–17తో నదియా ఫాన్ కాసర్‌ (స్విట్జర్లాండ్‌)–ఐరిస్‌ టబేలింగ్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా–సిక్కిరెడ్డి (భారత్‌) ద్వయం 16–21, 2–16, 15–21తో ఎంఆర్‌ అర్జున్‌ –కె. మనీషా (భారత్‌) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో శుభాంకర్‌ డే (భారత్‌) 12–21, 22–20, 21–17తో ఐదో సీడ్‌ జొనాథ¯Œ  క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయాన్ని సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement