ఐపీఎల్‌–10కు అశ్విన్, రాహుల్‌ దూరం | Ashwin, KL Rahul Miss in IPL 10 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌–10కు అశ్విన్, రాహుల్‌ దూరం

Apr 1 2017 2:04 AM | Updated on Sep 5 2017 7:35 AM

ఐపీఎల్‌–10కు అశ్విన్, రాహుల్‌ దూరం

ఐపీఎల్‌–10కు అశ్విన్, రాహుల్‌ దూరం

భారత స్టార్‌ క్రికెటర్లు రవిచంద్రన్‌ అశ్విన్, లోకేశ్‌ రాహుల్, మురళీ విజయ్‌ గాయాల కారణంగా ఈ నెల 5న మొదలయ్యే

న్యూఢిల్లీ: భారత స్టార్‌ క్రికెటర్లు రవిచంద్రన్‌ అశ్విన్, లోకేశ్‌ రాహుల్, మురళీ విజయ్‌ గాయాల కారణంగా ఈ నెల 5న మొదలయ్యే ఐపీఎల్‌–10 సీజన్‌ నుంచి వైదొలిగారు. అశ్విన్‌ పుణే రైజింగ్‌ సూపర్‌ జెయింట్‌ తరఫున, రాహుల్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున, విజయ్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున ఆడాల్సి ఉంది.

భుజం గాయం నుంచి ఇంకా కోలుకోని విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)... గత తొమ్మిది నెలలుగా విరామం లేకుండా జాతీయ జట్టుకు ఆడుతున్న రవీంద్ర జడేజా (గుజరాత్‌ లయన్స్‌), ఉమేశ్‌ యాదవ్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌) ఆరంభంలోని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశముంది. ‘నేను ఐపీఎల్‌లో ఆడటంలేదు. అధికారిక సమాచారాన్ని నా జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వెల్లడిస్తుంది’ అని రాహుల్‌ తెలిపాడు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి రాహుల్‌ లండన్‌ వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement