ఐపీఎల్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేం | Arun Singh Dhumal REACTS ON ipl 2020 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేం

Apr 14 2020 5:50 AM | Updated on Apr 14 2020 5:50 AM

Arun Singh Dhumal REACTS ON ipl 2020 - Sakshi

అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామా లేదా అన్న విషయంపై తమకే స్పష్టత లేనందున... ఈ సీజన్‌ టోర్నీ భవితవ్యంపై ఏమీ చెప్పలేమని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ తెలిపారు. ‘లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందువల్ల ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఐపీఎల్‌పై చర్చిస్తాం. ఒకవేళ ఇప్పుడు వాయిదా వేసి అక్టోబర్‌–నవంబర్‌లలో లీగ్‌ను నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు కూడా మా వద్ద సమాధానం లేదు. చర్చించడానికి ఏమీ లేనందున సోమవారం బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల మధ్య ఎలాంటి కాన్ఫరెన్స్‌ కాల్‌ జరగలేదు’ అని అరుణ్‌ ధుమాల్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement