చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు | Army Green Wins Volleyball Title | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు

Jul 27 2019 9:53 AM | Updated on Jul 27 2019 9:53 AM

Army Green Wins Volleyball Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ సర్వీసెస్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆర్మీ గ్రీన్‌ జట్టు విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌ ఈఎంఈ సెంటర్‌లోని ఈగల్‌ ఇండోర్‌ వాలీబాల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్‌ జట్టు 25–21, 26–24, 25–20తో ఇండియన్‌ నేవీపై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆర్మీ రెడ్, ఆర్మీ గ్రీన్, ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ టీమ్‌ జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం ఈఎంఈ సెంటర్‌ కమాండెంట్‌ కల్నల్‌ దేవదాస్‌ నందా విజేతలకు టైటిల్‌ను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement