పంజాబ్ వారియర్స్‌కు మరో గెలుపు | another victory for punjab warriors | Sakshi
Sakshi News home page

పంజాబ్ వారియర్స్‌కు మరో గెలుపు

Jan 27 2015 12:28 AM | Updated on Sep 2 2017 8:18 PM

పంజాబ్ వారియర్స్‌కు మరో గెలుపు

పంజాబ్ వారియర్స్‌కు మరో గెలుపు

హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో తమ జోరును కొనసాగిస్తూ పంజాబ్ వారియర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

మొహాలీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో తమ జోరును కొనసాగిస్తూ పంజాబ్ వారియర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో వారియర్స్ 3-2 గోల్స్ తేడాతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌ను ఓడించింది. వారియర్స్ తరఫున వరుణ్ కుమార్ (12వ ని.లో), ఎస్‌వీ సునీల్ (29వ ని.లో), సందీప్ సింగ్ (42వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా... విజార్డ్స్ జట్టుకు వీఆర్ రఘునాథ్ (7వ, 53 ని.లో) రెండు గోల్స్ అందించాడు.

ఈ గెలుపుతో పంజాబ్ జట్టు మొత్తం 12 పాయింట్లతో లీగ్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాంచీ రేస్, ఢిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్ల మధ్య రాంచీలో జరిగిన మ్యాచ్ 2-2 వద్ద ‘డ్రా’గా ముగిసింది.  ఢిల్లీ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్, డానిష్ ముజ్తబా చెరో గోల్ చేయగా... రాంచీ జట్టుకు నిక్ బడ్జెన్, మన్‌దీప్ సింగ్ ఒక్కో గోల్ అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement