
రూ. 42 లక్షలకు సొంతం చేసుకున్న కళింగ లాన్సర్స్
భారత ఆటగాళ్లలో వివేక్ లాక్రాకు రూ. 23 లక్షలు
హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల వేలం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో లియామ్ హెండర్సన్ అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుధవారం నిర్వహించిన మినీ వేలంలో... ఆస్ట్రేలియా డిఫెండర్ కోసం హెచ్‌ఐఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు 42 లక్షల రూపాయలకు అతడిని సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాళ్లు వివేక్ లాక్రా, అద్రోహిత్ ఎక్కా కూడా మంచి ధర దక్కించుకున్నారు.
అంతర్జాతీయ ఆటగాళ్లలో నెదర్లాండ్స్ డిఫెండర్ సండెర్ డె విజిన్‌ను తమిళనాడు డ్రాగన్స్ జట్టు రూ. 36 లక్షలకు కొనుగోలు చేసుకుంది. జర్మనీకి చెందిన ప్రిన్జ్‌ను అంతే మొత్తానికి యూపీ రుద్రాస్ జట్టు తీసుకుంది. భారత టీనేజ్ గోల్‌కీపర్ లక్రా రూ. 2 లక్షల ధరతో వేలంలో ప్రవేశించగా... అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ఆఖరికి బెంగాల్ టైగర్స్ 23 లక్షలకు సొంతం చేసుకుంది. మిడ్‌ఫీల్డర్ ఎక్కాను రూ. 11 లక్షలకు సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసుకుంది.
14 ఏళ్ల కేతన్ కుషా్వహాను బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 2.5 లక్షలకు తీసుకుంది. మొత్తం వేలంలో అతడే అతి పిన్న వయసు్కడు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడైన రూపిందర్ పాల్ సింగ్‌ను ఎస్జీ పైపర్స్ జట్టు రూ. 12 లక్షలకు సొంతం చేసుకుంది. అతడితో పాటు బెల్జియంకు చెందిన రోమన్ డువెకొట్, నెదర్లాండ్స్‌కు చెందిన బ్రామ్ వ్యాన్ బాటమ్‌ను కూడా ఫ్రాంచైజీ తీసుకుంది. ఆ్రస్టేలియాకు చెందిన కూపర్ బర్న్స్ కోసం కళింగ లాన్సర్స్ జట్టు రూ. 34.5 లక్షలు వెచ్చించింది.
మినీ వేలంలో కళింగ ఫ్రాంచైజీ ముగ్గురు భారత ఆటగాళ్లతో పాటు నలుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసుకుంది. ఆ్రస్టేలియా గోల్ కీపర్ స్నోడెన్‌ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న లాన్సర్స్... ఒడిశా జట్టు ప్లేయర్ సునీల్‌ను రూ. 2 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసుకుంది.
క్రెయిగ్ మరాయిస్, బాబీ సింగ్ ధామీని రూ. 10 లక్షల చొప్పున కొనుగోలు చేసుకుంది. యూపీ రుద్రాస్ ఫ్రాంచైజీ యాజమాన్యం అర్ధాంతరంగా తప్పుకోవడంతో... ఆ జట్టు బాధ్యతలను హెచ్‌ఐఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ తీసుకుంది. కొత్త యాజమాన్యం వచ్చేంత వరకు ఈ ఫ్రాంఛైజీ హెచ్‌ఐఎల్ ఆధ్వర్యంలో నడవనుంది.