మరో క్లీన్‌స్వీప్‌తో క్వార్టర్స్‌లోకి | Another cleansweep into quarters | Sakshi
Sakshi News home page

మరో క్లీన్‌స్వీప్‌తో క్వార్టర్స్‌లోకి

Feb 8 2018 1:30 AM | Updated on Feb 8 2018 1:30 AM

Another cleansweep into quarters - Sakshi

కిడాంబి శ్రీకాంత్‌

అలోర్‌ సెటార్‌ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో పసికూన జట్టు మాల్దీవులుతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. వరుసగా రెండో విజయంతో గ్రూప్‌ ‘డి’ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇదే గ్రూప్‌ నుంచి ఇండోనేసియా కూడా క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. గురువారం భారత్, ఇండోనేసియా జట్ల మధ్య మ్యాచ్‌ విజేత గ్రూప్‌ ‘టాపర్‌’గా నిలుస్తుంది. 
ఫిలిప్పీన్స్‌పై కూడా 5–0తో నెగ్గిన భారత్‌ అదే జోరును మాల్దీవులుపై కనబరిచింది.

పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ‘బర్త్‌డే బాయ్‌’ కిడాంబి శ్రీకాంత్‌ 21–5, 21–6తో జయన్‌ హుస్సేన్‌పై; సాయిప్రణీత్‌ 21–10, 21–4తో అహ్మద్‌ నిబాల్‌పై; సమీర్‌ వర్మ 21–5, 21–1తో అర్సలాన్‌ అలీపై గెలిచారు. డబుల్స్‌ మ్యాచ్‌ల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 21–8, 21–8తో జయన్‌ హుస్సేన్‌–షహీమ్‌ జోడీపై... అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ ద్వయం 21–2, 21–5తో అర్సలాన్‌ అలీ–అహ్మద్‌ నిబాల్‌ జోడీపై గెలిచాయి.     

Advertisement
 
Advertisement
Advertisement