ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది: అనిల్‌ కుంబ్లే

Anil Kumble picks his favourite to win in England and Wales - Sakshi

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా జరిగే క్రికెట్ ప్రపంచకప్ కోసం యావత్ క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ కప్ గెలిచే సత్తా ఎవరికి ఉందని పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనాలు తెలియజేశారు. తాజాగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే.. ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ గెలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్‌లలోనూ ఆస్ట్రేలియాకు అద్భుతమైన రికార్డు ఉన్న సంగతిని ఈ సందర్భంగా కుంబ్లే గుర్తు చేశాడు.

‘ఆస్ట్రేలియా ప్రతీ ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈసారి వాళ్ల జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులు కూడా ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లు విజయవంతంగా టోర్నమెంట్‌ను ముగిస్తారని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు విజయం ఎలా సాధించాలో తెలుసు. ప్రపంచకప్‌లో అది చాలా ముఖ్యం. వాళ్లు కచ్చితంగా సెమీఫైనల్స్‌కు చేరుతారు’ అని కుంబ్లే అన్నారు. మే 30వ తేదీ నుంచి మెగా సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

(ఇక్కడ చదవండి: వరల్డ్‌ కప్‌ అధికారిక గీతం విడుదల)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top