అనిల్‌ కుమార్‌కు టాప్‌ సీడింగ్‌ | anil kumar achives top seading first time | Sakshi
Sakshi News home page

అనిల్‌ కుమార్‌కు టాప్‌ సీడింగ్‌

Feb 24 2017 10:40 AM | Updated on Sep 5 2017 4:30 AM

భారత్‌లో తొలిసారిగా గ్రీన్‌ క్యారమ్‌ బోర్డులపై జరుగనున్న తెలంగాణ రాష్ట్ర గ్రీన్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో ఏజీ ఆఫీస్‌కు చెందిన ప్లేయర్‌ వి. అనిల్‌ కుమార్‌ టాప్‌ సీడింగ్‌ను దక్కించుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో తొలిసారిగా గ్రీన్‌ క్యారమ్‌ బోర్డులపై జరుగనున్న తెలంగాణ రాష్ట్ర గ్రీన్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో ఏజీ ఆఫీస్‌కు చెందిన ప్లేయర్‌ వి. అనిల్‌ కుమార్‌ టాప్‌ సీడింగ్‌ను దక్కించుకున్నాడు. ఈ ఏడాదిలో సాధించిన పాయింట్ల ఆధారంగా ఆటగాళ్లకు సీడింగ్స్‌ను కేటాయించారు. మొహమ్మద్‌ అహ్మద్‌ రెండో సీడ్‌గా బరిలోకి దిగనుండగా... ఇండియన్‌ ఆయిల్‌ ప్లేయర్‌ కె. శ్రీనివాస్, వి. శివానంద రెడ్డి (పోస్టల్‌)లకు వరుసగా మూడు, నాలుగు సీడింగ్స్‌ దక్కాయి.

 

శనివారం నుంచి జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో 224 మంది ఆటగాళ్లు... మహిళల విభాగంలో 40 మంది క్రీడాకారిణులు బరిలోకి దిగుతున్నారు. ఆరుసార్లు జాతీయ చాంపియన్‌ పి. నిర్మల (ఎల్‌ఐసీ) రెండేళ్ల తర్వాత తిరిగి ఈసారి టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ఆమెతో పాటు ప్రపంచ చాంపియన్‌ ఎస్‌. అపూర్వ (ఎల్‌ఐసీ) కూడా ఈ టోర్నీ బరిలోకి దిగుతుండటంతో మహిళల సింగిల్స్‌ పోటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టాప్‌–8 సీడింగ్‌ ప్లేయర్లు: 1. వి. అనిల్‌ కుమార్, 2. మొహమ్మద్‌ అహ్మద్, 3. కె.శ్రీనివాస్, 4. వి. శివానంద రెడ్డి, 5. సయ్యద్‌ జహీర్‌ (హైదరాబాద్‌), 6. ఎస్‌. ఆదిత్య (వి.10), 7. ఆర్‌డీ దినేశ్‌ బాబు (ఏజీఆఫీస్‌), 8. పి.పి. సురేశ్‌కుమార్‌ (ఇన్‌కం ట్యాక్స్‌).
 

Advertisement
 
Advertisement
Advertisement