ముర్రే అవుట్‌

Andy Murray to miss Australian Open - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు బ్రిటన్‌ స్టార్‌ దూరం  

లండన్‌: ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచిన ఆండీ ముర్రే వచ్చే నెలలో జరిగే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత నెలలో బ్రిటన్‌ తరఫున 32 ఏళ్ల ముర్రే డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఆడాడు. ఆ సమయంలో తన పాత గాయం తిరగబెట్టిందని అతను వెల్లడించాడు. ‘అత్యున్నత స్థాయిలో మళ్లీ పోటీ పడేందుకు ఎంతో శ్రమించాను. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌కు దూరం కావాల్సి వస్తోంది. నేను చాలా నిరాశ చెందాను. అయితే ఇటీవలి పరిణామాల తర్వాత ముందు జాగ్రత్తగానే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ముుర్రే చెప్పాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఐదు సార్లు ఫైనల్‌ చేరిన ముర్రే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top