సెమీస్‌లో ముర్రే | Andy Murray faces Tomas Berdych in semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ముర్రే

Jul 8 2016 2:15 AM | Updated on Sep 4 2017 4:20 AM

సెమీస్‌లో ముర్రే

సెమీస్‌లో ముర్రే

బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే.. ఏడోసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

లండన్: బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే.. ఏడోసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ ముర్రే 7-6 (12/10), 6-1, 3-6, 4-6, 6-1తో 12వ సీడ్ జో విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)పై నెగ్గాడు. 2013లో టైటిల్ సాధించిన ముర్రే... శుక్రవారం జరిగే సెమీస్‌లో బెర్డిచ్ (చెక్)తో తలపడతాడు. సోంగాతో తలపడిన 15 మ్యాచ్‌ల్లో 13సార్లు గెలిచిన ముర్రే కెరీర్‌లో ఇది 100వ విజయం.

 

Advertisement
 
Advertisement
Advertisement