ఆసీస్‌ ఈజ్‌ బ్యాక్‌: అలెన్‌ బోర్డర్‌

Allan Border Says Australia Is Back In World Cup 2019 - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా అప్రతిహత విజయాలతో దూసుకపోతోంది. టీమిండియాతో మ్యాచ్‌ మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో చాంపియన్‌ ఆటతో అబ్బురపరిచింది. దీంతో తాజాగా ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆసీస్‌ నిలిచింది.  దీంతో ఆసీస్‌ మాజీ ఆటగాళ్లతో పాటు ఆ జట్టు అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌పై విజయం అనంతరం ఆసీస్‌ మాజీ దిగ్గజ సారథి అలెన్‌ బోర్డర్‌ తమ జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు.
‘ఆరు నెలల క్రితం ఆసీస్‌ జట్టును చూసి భయమేసింది. ఈ జట్టా ప్రపంచకప్‌లో పాల్గొనబోయేది అంటూ అసంతృప్తి కలిగింది. కానీ నా అంచనా తప్పయింది. తాజా ప్రపంచకప్‌లో ఆసీస్‌ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ చూశాక నాకు పాత ఆసీస్‌ జట్టు గుర్తొచ్చింది. అప్పటి రోజులు, జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆసీస్‌ ఈజ్‌ బ్యాక్‌ అని ధృఢంగా నమ్ముతున్నా. ప్రస్తుత ఆసీస్‌ జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఉంది. ఆటగాళ్లలో పరిణితి పెరగింది. పరిస్థితులను ఆకలింపు చేసుకుంటున్నారు. 

కివీస్‌ మ్యాచ్‌లో నన్ను ఎక్కువగా ఆకర్షించించిన ఆటగాళ్లు కీపర్‌ అలెక్స్‌ క్యారీ, పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌. టిమ్‌ పైన్‌, మాథ్యూ హెడ్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉండగా అలెక్స్‌ ఎందకనీ అందరూ ప్రశ్నించారు. కానీ తన సత్తా ఏంటో ప్రపంచకప్‌లో నిరూపించాకుంటున్నారు. స్టార్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ప్రపంచకప్‌ హీరో.. తాజా టోర్నీలో కూడా తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌తో పాటు ఇంగ్లండ్‌, భారత్‌లు టైటిల్‌ ఫేవరేట్‌గా కనిపిస్తున్నాయి’అంటూ బోర్డర్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top