సెమీస్లో సాయి ప్రణీత్, జయరామ్ | Ajay Jayaram, B Sai Praneeth Reach Semifinals of Canada Open | Sakshi
Sakshi News home page

సెమీస్లో సాయి ప్రణీత్, జయరామ్

Jul 2 2016 4:58 PM | Updated on Sep 4 2017 3:59 AM

కెనడా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, అజయ్ జయరామ్లో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

కాల్గారి: కెనడా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, అజయ్ జయరామ్లు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 21-18 19-21-21-8 తేడాతో భారత్ కే చెందిన హర్షిల్ డానిపై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 47 నిమిషాలపాటు జరిగిన పోరులో జయరామ్ ఆద్యంతం ఆకట్టుకుని సెమీస్ లో కి ప్రవేశించాడు.

 

మరో క్వార్టర్ పోరులో  నాల్గో సీడ్ సాయి ప్రణీత్ 21-14, 21-16 తేడాతో ఎనిమిదో సీడ్ రౌల్ మస్త్(ఎస్టోనియా)పై గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లాడు. తమ తదుపరి పోరులో లి హున్(కొరియా)తో జయరామ్ తలపడనుండగా, బ్రైస్ లివర్డెజ్(ఫ్రెంచ్)తో సాయి ప్రణీత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇదిలా ఉండగా, భారత ఆటగాడు, రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ లో ఓటమి పాలయ్యాడు. ప్రణయ్ 22-20, 21-23, 18-21 తేడాతో  లివర్డెజ్పై పరాజయం చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement