చాంప్స్ పీఎస్‌పీబీ, ఎయిరిండియా | Air India, PSPB triumph | Sakshi
Sakshi News home page

చాంప్స్ పీఎస్‌పీబీ, ఎయిరిండియా

Feb 2 2015 1:18 AM | Updated on Sep 2 2017 8:38 PM

జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.


రన్నరప్ తెలంగాణ
* జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
 సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టైటిల్ పోరులో తెలంగాణ జట్టు 0-2తో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) చేతిలో ఓడింది. ఆదివారం ఇక్కడ జరిగిన టీమ్ చాంపియన్‌షిప్‌లో మహిళల టైటిల్‌ను పీఎస్‌పీబీ, పురుషుల ట్రోఫీని ఎయిరిండియా (ఏఐ) గెలుచుకున్నాయి.

రుత్విక శివాని, మేఘన, రీతు పర్ణాలు తెలంగాణ జట్టు తరఫున పోరాడారు. హైదరాబాద్ అమ్మాయిలు పి.వి.సింధు, జ్వాల, అశ్విని పొన్నప్ప (కర్ణాటక)లతో కూడిన పీఎస్‌పీబీ జట్టు చేతిలోనే తెలంగాణ ఓడింది. తొలి సింగిల్స్‌లో సింధు (పీఎస్‌పీబీ) 21-15, 21-16తో రుత్వికపై గెలిచింది. డబుల్స్‌లో సింధు-అశ్విని (పీఎస్‌పీబీ) జోడి 21-14, 5-21, 21-11తో మేఘన-రీతు పర్ణా జంటపై విజయం సాధించింది. పురుషుల విభాగం ఫైనల్లో ఎయిరిండియా 3-2తో పీఎస్‌పీబీపై చెమటోడ్చి నెగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement