జాతీయ టీటీ విజేత పీఎస్‌పీబీ


పాట్నా: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ సాధించాయి. గురువారం జరిగిన పురుషుల టీమ్  ఫైనల్లో పీఎస్‌పీబీ  3-0తో పశ్చిమ బెంగాల్‌పై గెలిచింది.

 

  శరత్ (పీఎస్‌పీబీ) 11-8, 11-7, 11-2తో సౌరవ్ పై, సౌమ్యజిత్ (పీఎస్‌పీబీ) 16-14, 7-11, 11-7, 11-4తో సౌమ్యదీప్‌పై, అమల్‌రాజ్ (పీఎస్‌పీబీ) 11-9, 11-8, 12-10తో సౌగతాపై గెలుపొందారు. మహిళల టీమ్ ఫైనల్లో పీఎస్‌పీబీ 3-0తో ఉత్తర బెంగాల్‌పై గెలిచింది. మధురిక (పీఎస్‌పీబీ) 6-11, 11-6, 12-10, 9-11, 11-5తో నందితపై, షామిని (పీఎస్‌పీబీ) 9-11, 11-5, 11-7, 10-12, 11-8తో సాగరికపై, అంకిత దాస్ (పీఎస్‌పీబీ) 11-9, 11-8, 11-7తో సుకన్యపై నెగ్గారు

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top