సెమీస్‌లో అహ్మదాబాద్‌ | Ahmedabad in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అహ్మదాబాద్‌

Jan 10 2018 1:20 AM | Updated on Jan 10 2018 1:20 AM

Ahmedabad in semis - Sakshi

చెన్నై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–3)లో కొత్తగా బరిలోకి దిగిన అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ జట్టు అందరికంటే ముందుగా సెమీస్‌ బెర్త్‌ సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన లీగ్‌ పోరులో అహ్మదాబాద్‌ 5–0తో ముంబై రాకెట్స్‌పై ఘనవిజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లా చెక్‌ హిమ్‌–కమిల్లా రైటర్‌ (అహ్మదాబాద్‌) జోడి 15–11, 15–7తో  లీ యంగ్‌ డే–స్టోయెవా జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ (అహ్మదాబాద్‌) 15–12, 15–12తో సన్‌ వాన్‌ హోపై, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (అహ్మదాబాద్‌) 15–9, 15–12తో బీవెన్‌ జాంగ్‌పై నెగ్గారు. రెండో పురుషుల సింగిల్స్‌ ఇరు జట్లకు ‘ట్రంప్‌’ మ్యాచ్‌ కాగా... ఇందులో సౌరభ్‌ వర్మ (అహ్మదాబాద్‌) 15–14, 15–11తో సోదరుడు సమీర్‌ వర్మపై గెలిచాడు.

చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో రెగినాల్డ్‌–నందగోపాల్‌ (అహ్మదాబాద్‌) ద్వయం 10–15 12–15తో లీ యంగ్‌ డే–బూన్‌ హియాంగ్‌ తన్‌ జంట చేతిలో ఓడింది. ఐదు మ్యాచ్‌లాడిన అహ్మదాబాద్‌ మూడు విజయాలు సాధించి 17 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. తాజా ఓటమితో నిర్ణీత ఐదు లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై రాకెట్స్‌తోపాటు డిఫెండింగ్‌ చాంపియన్‌... పీవీ సింధు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్‌ (12 పాయింట్లు) లీగ్‌ దశలోనే నిష్క్రమించాయి. నేటి నుంచి హైదరాబాద్‌ అంచె పోటీలు ప్రారంభమవుతాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement