మళ్లీ నిరాశ పరిచిన మంధన | Again smriti mandhana disappointed for indian fans | Sakshi
Sakshi News home page

మళ్లీ నిరాశ పరిచిన మంధన

Jul 20 2017 6:58 PM | Updated on Sep 5 2017 4:29 PM

మళ్లీ నిరాశ పరిచిన మంధన

మళ్లీ నిరాశ పరిచిన మంధన

భారత ఓపెనర్ స్మృతి మంధన మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది.

డెర్బీ: భారత ఓపెనర్ స్మృతి మంధన మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. గత నాలుగు మ్యాచుల్లో వరుసగా విఫలమైన ఓపెనర్ స్మృతి మంధన మరోసారి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టోర్ని ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టిన ఈ బ్యూటిఫుల్ లేడీ క్రికెటర్ భారత్ అభిమానుల మనసును దోచుకుంది.
 
తొలి మ్యాచ్ ఇంగ్లండ్ తో 90 పరుగుల, వెస్టిండీస్ తో సెంచరీతో చెలరేగిన మంధన తరువాతి నాలుగు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఆసీస్ తో జరుగుతున్న సెమీస్ లోనైనా రాణిస్తుందనుకున్న అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. ఆసీస్ బౌలర్ విలాని తొలి ఓవర్లో ఫోర్ తో పరుగుల ఖాత తెరిచిన మందన(6) చివరి బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement