అఫ్గాన్‌ యువ సంచలనం అరుదైన ఘనత | Afghanistan player Mujeeb Zadran is 21st century first cricketer | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ యువ సంచలనం అరుదైన ఘనత

Dec 7 2017 1:35 PM | Updated on Dec 7 2017 1:38 PM

Afghanistan player Mujeeb Zadran is 21st century first cricketer - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రంలోనే అదరగొట్టిన అఫ్గానిస్తాన్‌ యువ క్రికెటర్ ముజీబ్ జర్దాన్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. తొలి వన్డే మ్యాచ్ అయినా ఈ ఆఫ్ స్పిన్నర్ అద్భుతంగా (4/24) రాణించడంతో ప్రత్యర్ధి ఐర్లాండ్ పై అఫ్ఘాన్ జట్టు 138 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా, 21వ శతాబ్ధానికి చెందిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా ముజీబ్ అరుదైన ఘనత వహించాడు. తొలి మ్యాచ్‌లోనే ఎలాంటి తొందరపాటు, కంగారే లేకుండా వైవిధ్య బంతులతో ఐర్లాండ్‌ జట్టును ముప్పు తిప్పలు పెట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ముజీబ్.. భవిష్యత్తులో జట్టు కీలక బౌలర్‌గా ఎదుగుతాడని కోచ్, కెప్టెన్లు ప్రశంసల జల్లులు కురిపించారు.

2001, మార్చి 28న పుట్టిన ఈ అఫ్గాన్‌ కుర్రాడు.. 21వ శతాబ్ధంలో జన్మించి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తొలి ప్లేయర్‌గానూ నిలిచాడు. 16 ఏళ్ల 252 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ముజీబ్.. అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. కాగా, భారత్‌ నుంచి సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్. 1989లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సమయంలో సచిన్ వయసు కేవలం 16 ఏళ్ల 242 రోజులన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement