breaking news
Mujeeb Zadran
-
‘అశ్విన్ చెప్పిన మిస్టరీ బాల్‌ను ప్రయోగిస్తా’
న్యూఢిల్లీ: ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ దగ్గర నేర్చుకున్న మెళుకువల్ని టీమిండియాపైనే ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ జర్దాన్ స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ వద్ద అనేక బౌలింగ్ సీక్రెట్లను తెలుసుకున్నానని, వాటిని త్వరలో భారత్‌తో జరిగే టెస్టులో ప్రయోగిస్తానన్నాడు. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరపున ముజీబ్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం భారత్‌తో బెంగళూరు వేదికగా అఫ్గాన్-భారత్ జట్ల మధ్య ఏకైక టెస్టు జరుగనున్న నేపథ్యంలో ముజీబ్ ఇంటర్య్వూ ఇచ్చాడు. ‘ ఐపీఎల్ ఆడే సందర్భంలో నెట్స్‌లో ఎక్కువగా అశ్విన్‌తో గడిపేవాడిని. దాంతో చాలా విషయాల్ని నేర్చుకున్నాను. ప్రధానంగా బంతిని ఏ రకంగా సంధించి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టవచ్చో తెలిసింది. కొత్త బంతితో బౌలింగ్ వేసే విధానాన్ని కూడా అశ్విన్ ద్వారా తెలుసుకున్నా. ఆఫ్ స్పిన్ యాక్షన్‌లో క్యారమ్ బాల్‌ను ఎలా వేయాలో కూడా అశ్విన్ నేర్పాడు. దాంతో పాటు ఒక మిస్టరీ బాల్‌ను కూడా అశ్విన్ చెప్పాడు. ఆ బంతిని భారత్‌పై జరిగే టెస్టులో ప్రయోగిస్తా’ అని ముజీబ్ చెప్పాడు. -
అఫ్గాన్ యువ సంచలనం అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్ : ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రంలోనే అదరగొట్టిన అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ జర్దాన్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. తొలి వన్డే మ్యాచ్ అయినా ఈ ఆఫ్ స్పిన్నర్ అద్భుతంగా (4/24) రాణించడంతో ప్రత్యర్ధి ఐర్లాండ్ పై అఫ్ఘాన్ జట్టు 138 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా, 21వ శతాబ్ధానికి చెందిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా ముజీబ్ అరుదైన ఘనత వహించాడు. తొలి మ్యాచ్‌లోనే ఎలాంటి తొందరపాటు, కంగారే లేకుండా వైవిధ్య బంతులతో ఐర్లాండ్ జట్టును ముప్పు తిప్పలు పెట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ముజీబ్.. భవిష్యత్తులో జట్టు కీలక బౌలర్‌గా ఎదుగుతాడని కోచ్, కెప్టెన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. 2001, మార్చి 28న పుట్టిన ఈ అఫ్గాన్ కుర్రాడు.. 21వ శతాబ్ధంలో జన్మించి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తొలి ప్లేయర్‌గానూ నిలిచాడు. 16 ఏళ్ల 252 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ముజీబ్.. అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. కాగా, భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్. 1989లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సమయంలో సచిన్ వయసు కేవలం 16 ఏళ్ల 242 రోజులన్న విషయం తెలిసిందే.