వరల్డ్ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారమిక్కడ నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్కాట్లాండ్‌తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
నాగ్ పూర్: వరల్డ్ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారమిక్కడ నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్కాట్లాండ్‌తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన మహమ్మద్ షాహజాద్ 61 పరుగులు చేయగా, నూర్ అలీ జిద్రాన్ 17 పరుగులు చేసి పెవీలియన్ చేరారు.
గుల్బదీన్ కూడా 12 పరుగులకే పరిమితం కాగా, మహమ్మద్ నాబి రన్ ఔటయ్యాడు. దాంతో 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి అఫ్ఘానిస్తాన్ 145 పరుగులతో కొనసాగుతోంది. కాగా, స్కాట్లాండ్ బౌలర్లు ఎమ్‌ఆర్‌జె వాట్, డేవీ, ఈవాన్స్ తలో వికెట్ తీసుకున్నారు.