సెమీస్‌లో అభిషేక్, మురళీ | Abhishek, Murali in Semis of Badminton Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అభిషేక్, మురళీ

Apr 7 2019 4:25 PM | Updated on Apr 7 2019 4:25 PM

Abhishek, Murali in Semis of Badminton Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంకే ఇంటర్‌ స్కూల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అను సంజన, మురళీ, అభిషేక్‌ ముందంజ వేశారు. డీపీఎస్‌ నాచారంలో జరుగుతోన్న  ఈ టోర్నీలో వీరు ఆయా వయో విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన అండర్‌–11 బాలికల తొలి మ్యాచ్‌లో అనన్య రాణే 30–12తో అన్యపై, రెండో మ్యాచ్‌లో 30–15తో వైష్ణవిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అను సంజన 30–9తో కునాలికను ఓడించింది.

అండర్‌–13 బాలికల విభాగంలో అను సంజన 30–15తో స్మితపై, 30–22తో లహరిపై విజయం సాధించి ముందంజ వేసింది. బాలుర కేటగిరీలో అభిషేక్‌ ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో 30–9తో సంజయ్‌ కుమార్‌పై గెలుపొందిన అభిషేక్, రెండో మ్యాచ్‌లో 30–20తో సాయి ప్రవీణ్‌ను ఓడించాడు. అండర్‌–15 బాలుర కేటగిరీలో అభిషేక్‌ 30–10తో ఆర్యవర్ధన్‌పై, రెండో మ్యాచ్‌లో 30–12తో సుదర్శన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement