‘వంద’లో సున్నా..! | Aaron Finch fails to sour milestone ODI | Sakshi
Sakshi News home page

‘వంద’లో సున్నా..!

Mar 2 2019 2:17 PM | Updated on Mar 2 2019 2:23 PM

Aaron Finch fails to sour milestone ODI - Sakshi

హైదరాబాద్‌: గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ మరోసారి నిరాశపరిచాడు. భారత్‌తో శనివారం ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఫించ్‌ డకౌట్‌గా నిష్క్రమించాడు. మూడు బంతులు ఆడిన ఫించ్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరాడు. భారత పేసర్‌ బుమ్రా వేసి ఇన‍్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ధోనికి క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలోనే అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఫించ్‌. ఇది ఫించ్‌కు వందో వన్డే. ఈ మ్యాచ్‌లో ఫించ్‌ డకౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్‌ తరఫున ఇలా వందో మ్యాచ్‌లో సున్నాకే ఔటైన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు డీన్‌ జోన్స్‌, క్రెయిగ్‌ మెక్‌డెర్మట్‌లు వందో వన్డేలో డకౌట్‌గా ఔటైన ఆసీస్‌ క్రికెటర్లు. ఇప్పుడు వారి సరసర ఫించ్‌ చేరిపోయాడు.

తాజా మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలవడంతో బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఫించ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే వికెట్‌ను నష్టపోయింది. ఇదిలా ఉంచితే, 2018-19 సీజన్‌లో ఫించ్‌ సగటు దారుణంగా ఉంది. టెస్టుల్లో 27.80 సగటు నమోదు చేయగా, వన్డేల్లో 11.85 సగటు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 7.50 సగటుతో ఉన్నాడు.

ఇక్కడ చదవండి: చహల్‌కు విశ్రాంతి.. జడేజా రీఎంట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement