4 X100 మీ. రిలేలో జాతీయ రికార్డు | 4 X 100 m. Relay national record | Sakshi
Sakshi News home page

4 X100 మీ. రిలేలో జాతీయ రికార్డు

May 19 2016 1:19 AM | Updated on Sep 4 2017 12:23 AM

4 X100 మీ. రిలేలో జాతీయ రికార్డు

4 X100 మీ. రిలేలో జాతీయ రికార్డు

బీజింగ్ వరల్డ్ చాలెంజ్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత రిలే మహిళల జట్టు 4 X100 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పింది.

న్యూఢిల్లీ: బీజింగ్ వరల్డ్ చాలెంజ్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత రిలే మహిళల జట్టు 4ఁ100 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పింది. చైనాలోని బీజింగ్‌లో బుధవారం జరిగిన ఈ మీట్‌లో ద్యుతీచంద్, శ్రాబని నంద, హెచ్‌ఎం జ్యోతి, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన భారత బృందం 44.03 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని సంపాదించింది.

ఈ క్రమంలో ద్యుతీచంద్ జట్టు 1998లో సరస్వతి, రచిత మిస్త్రీ, షైలా, పీటీ ఉష బృందం 44.43 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళల రిలే జట్టుకు తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement