30 ఏళ్లుగా అదే వ్యసనం.. | 30 years | Sakshi
Sakshi News home page

30 ఏళ్లుగా అదే వ్యసనం..

Jul 5 2015 12:40 AM | Updated on Oct 2 2018 8:39 PM

30 ఏళ్లుగా అదే వ్యసనం.. - Sakshi

30 ఏళ్లుగా అదే వ్యసనం..

క్రికెట్ స్టేడియాల్లో కనిపించే వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ లాగే ఫుట్‌బాల్‌లోనూ భారత్‌లో ఓ అభిమాని ఉన్నాడు. కోల్‌కతాకు చెందిన బాపి మజీ అనే అభిమానికి మో హన్ బగాన్ క్లబ్ అంటే పిచ్చి.

కోల్‌కతా: క్రికెట్ స్టేడియాల్లో కనిపించే వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ లాగే ఫుట్‌బాల్‌లోనూ భారత్‌లో ఓ అభిమాని ఉన్నాడు.  కోల్‌కతాకు చెందిన బాపి మజీ అనే అభిమానికి మో హన్ బగాన్ క్లబ్ అంటే పిచ్చి. ఎంతగా అంటే గత 30 ఏళ్లుగా ఈ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లను స్టేడియంలో కూర్చుని మరీ చూస్తున్నాడు. దీని కోసం సొంత డబ్బులతో దేశమంతా తిరిగాడు. ఇంతా చేసి ఇతడేమైనా ధనికుడా అంటే అంత సీన్ లేదు.
 
 నార్త్ కోల్‌కతాలోని పాయిక్‌పారా అనే ప్రాంతంలో చిన్న టీకొట్టే ఇతడికి జీవనాధారం. పర్యటనల కోసం డబ్బు ఇబ్బందిగా ఉందని నాలుగేళ్ల క్రితం కుటుంబానికి చెందిన రెండు గదులను అమ్మేశాడు. ఆ డబ్బులు కూడా అయిపోయాక భార్యకు చెందిన నగలను కుదువపెట్టి మరీ మ్యాచ్‌లను చూశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement