ఈ పిల్లి నిజంగా చాలా స్మార్ట్‌ | Watch Hillarious Video About Cat Vs Dog | Sakshi
Sakshi News home page

ఈ పిల్లి నిజంగా చాలా స్మార్ట్‌

Apr 11 2020 6:35 PM | Updated on Apr 11 2020 6:55 PM

Watch Hillarious Video About Cat Vs Dog  - Sakshi

సాధారణంగా కుక్కను చూస్తేనే పిల్లి ఆమడదూరం పరిగెడుతుందనేది అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడైనా పిల్లి, కుక్క ఎదురైనప్పుడు కూడా అందులో విజయశాతం ఎక్కువగా కుక్కవైపే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఈ రెండింటికి పోటీ పెట్టగా.. పిల్లి చేతిలో ఓడిపోయి కుక్క తెల్లమొహం వేయాల్సి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయిన ఒక మహిళ తన పెంచుకుంటున్న పెంపుడు పిల్లికి, కుక్కకు పోటీ పెట్టాలని భావించింది. అనుకుందే తడవుగా తన ఇంట్లోని వస్తువులను తీసుకువచ్చి వాటి మధ్య గ్యాప్‌ ఇస్తూ నాలుగు వరుసల్లో పేర్చింది. మొదట తన పిల్లిని తీసుకొచ్చి ఆ వస్తువుల ముందు వదిలింది. కాసేపు చూసిన పిల్లి అక్కడ ఉన్న వస్తువులను ఒక్కటి కూడా కింద పడేయకుండా మెళ్లిగా అడుగులు వేస్తూ అవతలి వైపుకు వెళ్లిపోయింది.

ఆ తర్వాత కుక్క వంతు వచ్చింది. అయితే వస్తువులను దాటడానికి కొంచెం కన్ఫ్యూజన్‌ ఏర్పడడంతో కుక్క అలాగే నిలుచుండిపోయింది. అనంతరం వస్తువులను దాటే క్రమంలో ఒక్కసారిగా జంప్‌ చేయడంతో అవి చిందరవందరగా పడిపోయాయి. దాంతో ఆ యజమాని యుద్ధంలో పిల్లి గెలిచిందంటూ ప్రకటించింది. దాదాపు 25 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ఆమె ట్విటర్‌లో షేర్‌ చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ' పిల్లి తెలివితో ఆలోచించి అడుగులు వేసింది.. కానీ కుక్క మాత్రం అది చేయలేకపోయింది.. ఈ పిల్లి చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తూ అడుగులు వేసింది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement