సమకాలీన పరిస్థితులపై సెహ్వాగ్‌ ట్వీట్‌.. వైరల్‌

Virender Sehwag Tweet on caste and religion - Sakshi

టీమిండియా క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో పోస్టులు ఎంత సరదాగా ఉంటాయో.. ఒక్కోసారి అంత ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. తోటి ఆటగాళ్లపై సెటైర్లు వేయటమే కాదు.. సామాజిక అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటారు. 

ఈ క్రమంలో కుల, మతాలపై వీరూ చేసిన ఓ పోస్టు తెగ వైరల్‌ అవుతోంది. వాట్సాప్‌లో గాడ్‌ (దేవుడు) పేరిట వరల్డ్‌(ప్రపంచం) అనే గ్రూప్‌ను సృష్టించి.. దానికి మనుషులు, ప్రేమ, మానవత్వాన్ని యాడ్‌ చేశారు. ఆపై మనుషులు దానికి కులం, మతాల్ని జత చేర్చగా... భరించలేని దేవుడు గ్రూప్‌ నుంచే ఎగ్జిట్‌ అయిపోయాడు. దీనిని వీరూ సరిగ్గా సరిపోయేది అంటూ తన ట్విట్టర్‌లో గురువారం పోస్టు చేశాడు.

పాతదే అయినప్పటికీ వీరూ అకౌంట్‌లో ఇది దర్శనమివ్వటం.. ఆలోచింపజేసేలా ఉండటంతో ఫ్యాన్స్‌, సెలబ్రిటీలు కూడా మళ్లీ దానిని రీ ట్వీట్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top