టిక్‌టాక్‌లో వైరలవుతోన్న జేసీబీ వీడియో

Tiktok Video of JCB Machines Doing Naagin Dance - Sakshi

టిక్‌టాక్‌ యాప్‌ పుణ్యామా అని సామన్యులు కూడా రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వాహనాలు కూడా టిక్‌టాక్‌లో బాగా పాపులర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టిక్‌టాక్‌లో #JCBKiKhudayi హ్యాష్‌ట్యాగ్‌ కూడా విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జేసీబీకి సంబంధించిన మరో వీడియో టిక్‌టాక్‌లో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా జేసీబీ మిషన్‌లతో నాగిని డ్యాన్స్‌ చేయించాడు. విననడానికి విడ్డూరంగా ఉన్న నిజం. ఓ యువకుడు జేసీబీల ముందు కూర్చుని నాగిని సినిమాలోని మైనే తేరీ దుష్మన్‌ సాంగ్‌ను ప్లే చేస్తుండగా.. మరో వ్యక్తి ఆ మిషన్‌లను పాటకు తగ్గట్టు ఆడిస్తూ వాటితో నాగిని డ్యాన్స్‌ చేయించారు.

క్రిష్ణ భట్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేయడమే కాక.. టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయనందుకు ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వరల్డ్‌కప్‌లో ఇండియా ఓడిపోవడంతో బాధలో ఉన్న వారికి ఈ వీడియో కొత్త ఉత్సాహాన్ని కల్గిస్తుంది’.. ‘వాటే క్రియేటివిటీ’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top