వైరల్‌ వీడియో ; ఒకర్ని మించి మరొకరు | School Students Wonderful Front Jump Feet On Road Viral Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో : వీళ్లు పిల్లలు కాదు పిడుగులే..!

Aug 26 2019 2:13 PM | Updated on Aug 26 2019 2:49 PM

School Students Wonderful Front Jump Feet On Road Viral Video - Sakshi

ఇద్దరు విద్యార్థులు చేసిన ఫీట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒకర్ని మించి మరొకరు రోడ్డుపైనే అమాంతం వారు గాల్లోనే పల్టీలు కొట్టారు.

కోల్‌కత : చేతిలో మొబైల్‌ ఉంటే చాలు పోకేమాన్‌, పబ్‌జీ అంటూ గంటల తరబడి దానికే అతుక్కుపోయే నేటి కాలంలో.. పిల్లలూ, పెద్దలనే తేడా లేకుండా అందరూ వ్యాయామం అనే మాటనే మరిచారు. కాలు కదపకుండా సుఖానికి అలవాటు పడ్డారు. ఇక పాఠశాలల్లో గంటల తరబడి పబ్‌జీ ఆడుతున్నారని గుజరాత్‌ ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్‌ చేసింది. అయితే, పశ్చిమబెంగాల్‌లోని ఓ స్కూల్‌ విద్యార్థులు మాత్రం వీటన్నిటికీ భిన్నం. చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా..! అనిపించుకుంటున్నారు.

తాజాగా.. ఆ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చేసిన ఫీట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఒకర్ని మించి మరొకరు రోడ్డుపైనే అమాంతం వారు గాల్లోనే పల్టీలు కొట్టారు. ఐఏఎస్‌ అధికారి ఎంవీ రావు ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘అద్భుతమైన సన్నివేశం. భారత్‌కు జిమ్నాస్ట్స్‌ రూపుదిద్దుకుంటున్నారు’అని పేర్కొన్నారు. విద్యార్థులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రోడ్డుపై జంపింగ్‌ చేయడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement