రెస్టారెంట్‌ రసీదులో ‘భయపెట్టె పాప’

Restaurant Waiter Bill Typed By Terrifying Kid In New Zealand - Sakshi

సాధారణంగా పిల్లలను, కుటుంబ సభ్యులను తీసుకొని రొటీన్‌కు భిన్నంగా ఏదైనా రెస్టారెంట్‌కు పసందైన భోజనం కోసం వెళ్లతారు. అలా రెండేళ్ల తన పాపను కింబర్లీస్జే అనే మహిళ న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్‌లోని కాఫీసుప్రీం రెస్టారెంట్‌కు వెళ్లింది. కానీ ఆమెకు ఊహించని విధంగా ఆ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. వివరాలు.. రెస్టారెంట్‌లో పని చేసే సిబ్బంది సదరు మహిళలకు టేబుల్‌ నంబర్‌ను కేటాయింటే రసీదుపై కింబర్లీస్జే కూతురును ఉద్దేశిస్తూ ‘భయపెట్టే పాప’ అని టైప్‌ చేసి ఇచ్చారు. ఆ రసీదు చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టారెంట్‌ సిబ్బంది తన కుమార్తె మీద ఉద్దేశపూర్వకంగా అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండటమే కాకుండా రసీదు మీద రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ రసీదు ఫోటోను ఆమె తనఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి.. క్రైస్ట్‌చర్చ్‌లోని కాఫీసుప్రీం రెస్టారెంట్‌ సిబ్బంది తన కూతురిని అగౌవరపరిచారని వాపోయారు. అదే విధంగా సదరు రెస్టారెంట్‌ యాజమాన్యం తమ సిబ్బందికి కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలనే  విషయంలో సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ‘నా కూతురు ఎప్పుడూ ఎవరిని భయపెట్టలేదు. ఎలాంటి సమస్యలు కలిగించలేదు. ఈ రోజు రెస్టారెంట్‌కి వచ్చిన చాలా మంది నా కూతురిని చూసి చాలా క్యూట్‌గా ఉందని మురిసిపోయారు’ అని కింబర్లీస్జే వివరించారు. ఈ ఉద్దేశపూర్వక చర్యతో రెస్టారెంట్‌ యాజమాన్యం తరచూ వచ్చే కస్టమర్లను కోల్పోయిందని తెలిపారు. తాజాగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమ సిబ్బంది చేసిన తప్పుకు చింతిస్తున్నామని పాప తల్లి కింబర్లీస్జేకి రెస్టారెంట్‌ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top