గ్రూప్‌ అడ్మిన్లూ...బీ కేర్‌ఫుల్‌

police wathcing you..Facebook, Whatsapp admins beware

సాక్షి,పాట్నా: ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు షాకింగ్‌ న్యూస్‌. వీరిని పోలీసుల నిరంతర నిఘా వెంటాడటంతో పాటు ప్రాసిక్యూట్‌ చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. బీహార్‌ పోలీసులు ఈ మేరకు సోషల్‌ మీడియాపై గట్టి నియంత్రణలు చేపట్టారు. సోషల్‌ మీడియా గ్రూప్‌ల్లో అభ్యంతరకర, అవాస్తవ సమాచారం వ్యాపిస్తుండటంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపులపై బీహార్‌ అధికార యంత్రాంగం దృష్టిసారించింది. దర్బంగా పోలీసులకు సోషల్‌ మీడియాలో వచ్చే అవాస్తవ కంటెంట్‌తో కునుకు లేకుండా పోయింది.

ఆధారాల్లేని, అవాస్తవ సమాచారంతో భిన్నవర్గాల ప్రజల మధ్య ఘర్షణలు,ఉద్రిక్తతలు తలెత్తడంతో సోషల్‌ మీడియా గ్రూపులపై బీహార్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దర్బంగా ఉదంతంలో వదంతులు, అవాస్తవ సమాచారాన్ని వాట్సాప్‌, ఎఫ్‌బీ గ్రూప్‌ అడ్మిన్లు కాపీ, పేస్ట్‌ ఫార్మాట్‌లో పలు ఇతర గ్రూపులకు ఫార్వాడ్‌ చేయడంతో ఇబ్బందులు అధికమయ్యాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూపుల్లో సర్క్యులేట్‌ అయ్యే కంటెంట్‌ను వెరిఫై చేసుకోలేదని తేలినే గ్రూప్‌ అడ్మిన్లపై చర్యలు చేపడతామని దర్బంగా ఎస్‌ఎస్‌పీ సత్యవీర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. నిజాయితీతో కూడిన వారినే గ్రూపులో యాడ్‌ చేసుకోవాలని గ్రూప్‌ అడ్మిన్లకు బీహార్‌ పోలీసులు సూచించారు. ఏదైనా గ్రూప్‌లో మత ఉద్రిక్తతలు, సామాజిక అలజడులు రేపే కంటెంట్‌ సర్క్యులేట్‌ అయితే కేవలం దాన్ని పంపిన వారు, ఫార్వడ్‌ చేసిన వారినే కాకుండా గ్రూప్‌ అడ్మిన్‌పైనా చర్య తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top