‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను!’

Kiren Rijiju Share Bizarre Video Beehive In The Most Inappropriate Place - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తేనె అంటే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ ఇష్టమే. ప్రస్తుత జీవనశైలిలో తేనె వాడకం చాలా పెరిగి పోయింది. ఎక్స్‌ట్రా హనీ కావాలంటూ అడగటం మనం వింటూనే ఉంటాం. అయితే కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు షేర్‌ చేసిన వీడియో చూశాక జీవితంలో తేనె వాడమని అంటున్నారు పలువురు నెటిజన్లు. తేనెపట్టు సాధారణంగా చెట్లకు లేదా ఇంటి కప్పులకు వేలాడుతూ ఉండటాన్ని చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తిపై ఉండరాని చోట ఉండటం చూసి అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి బ్యాక్‌ సీట్‌పై తేనెపట్టు ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్‌ రిజిజు షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి షేర్‌ చేసిన వీడియో కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. భారత షట్లర్‌ గుత్తా జ్వాలాతో సహా అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్‌ చేస్తున్నారు. ‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను’అని ఓ నెటిజన్‌ సరదాగా పేర్కొనగా.. ‘ఇంకా నయం జీన్స్‌ ప్యాంట్‌ వేసుకున్నావు కాబట్టి బతికిపోయావ్‌, లేదంటే? అంతే సంగతి’  అని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు. అయితే మరికొంత మంది ఆ వ్యక్తిపై జాలి చూపించారు. తరువాత ఏమయిందని ఉత్సుకతతో అడుగుతున్నారు. ఇక తేనెటీగల పెంపకంలో నాగాలాండ్‌ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top