ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా మారిన ఎంపీ..!

Hyderabad MP Asaduddin Owaisi Clears Traffic At Old City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా మారారు. పాతబస్తీలోని ఫతే దర్వాజా చౌరస్తాలో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లడంతో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అదేసమయంలో ఎంపీ అసదుద్దీన్‌ కూడా చార్మినార్‌ నుంచి మిస్రాజ్‌గంజ్‌వైపు వెళ్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎంపీ వాహనదారులకు తగు సూచనలు చేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. స్వయంగా ఎంపీ కారు దిగి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి పూనుకోవడంతో అక్కడున్న మిగతావారు ఆయనకు తోడుగా నిలిచారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రంజాన్‌ మాసం కావడంతో ఫతే దర్వాజా చౌరస్తాలో రద్దీ ఎక్కువడా ఉంటుందని, వ్యాపారులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరడంతో ఈ కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నాలుగోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ పక్షాన పోటీ చేసిన భగవంత్‌రావుకు రెండోసారి ఓటమి తప్పలేదు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top