యువీకి భజ్జీ అదిరిపోయే పంచ్‌! | Harbhajan Singh Trolls Yuvraj Singh Tweet | Sakshi
Sakshi News home page

Jun 6 2018 6:02 PM | Updated on Jun 6 2018 6:55 PM

Harbhajan Singh Trolls Yuvraj Singh Tweet  - Sakshi

హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌: టీమిండియా సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌కు స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ అదిరిపోయే పంచ్‌ఇచ్చాడు. ట్విటర్‌లో ఎప్పుడూ ఫన్నీ ట్వీట్స్‌తో అభిమానులను అలరించే భజ్జీ.. ఈ సారి తన సహచర ఆటగాడు చేసిన ఓ ట్వీట్‌పై సెటైరిక్‌గా స్పందించాడు. ముంబైలోని కరెంట్‌ కోతలకు చికాకు పడ్డ యువీ రెండు రోజుల క్రితం ‘బంద్రాలో కరెంట్‌ పోయి గంటైంది.. తెప్పించగలరా?’  అని ట్వీట్‌ చేశాడు. దీనికి భజ్జీ  బిల్లు కడితే కరెంట్‌ వస్తుందని బదులిస్తూ చమత్కరించాడు. భజ్జీ ఫన్నీ రిప్లే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ ఇద్దరు పంజాబ్‌ ఆటగాళ్లు చాలా కాలం టీమిండియా ఆడారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో హర్భజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో భజ్జీ 7 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్‌ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక యువరాజ్‌ కింగ్స్‌పంజాబ్‌ తరుపున బరిలోకి దిగి తీవ్రంగా నిరాశ పరిచాడు. 8 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement