వైరల్‌.. చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క

Dog Saves A Little Girl From Falling Into Water - Sakshi

కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. అయితే కొన్ని ఘటనలు చూసినప్పుడు వారు ఈ మాట ఊరికనే చెప్పలేదని అనిపిస్తుంది. తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల మనసును దోచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియోలో ఏముందంటే..
నది పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నారి.. బాల్‌ను నీళ్లలో పడవేసుకుంటారు. తర్వాత దాన్ని తీసేందుకు నదిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తారు. దీన్ని గమనించిన ఒక కుక్క వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని గౌను పట్టుకుని వెనక్కి లాగి పడేస్తుంది. ఇలా చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాకుండా.. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చి ఆ పాపకు అందజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. కుక్క చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కుక్కను మెచ్చుకుంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసం అయింది కాబట్టే చాలా మంది తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటారు. కొంత మంది మాత్రం కుక్కను కూడా తమలో ఒక్కరిగా చూస్తారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top