అసభ్య ప్రవర్తన; తెలివైన కౌంటర్‌!

Chinmayi Shuts Man With Epic Reply Who Misbehaved With Her - Sakshi

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి గాయని చిన్మయి శ్రీపాద విపరీతంగా ట్రోలింగ్‌కు గురువుతూనే ఉన్నారు. పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్‌ చేయడం ఆకతాయిలకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా.. ఓ ప్రబుద్ధుడు.. ‘దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్‌ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్‌ చేస్తూ మగ అహంకారం ప్రదర్శించాడు.

ఇక తాజాగా మరో మగానుభావుడు ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి తన పశు ప్రవృత్తిని బయటపెట్టుకున్నాడు. ‘మీ నగ్నచిత్రాలు పంపండి’ అంటూ వెకిలి కామెంట్లతో నీచంగా ప్రవర్తించాడు. అయితే మీటూ ఉద్యమంలో భాగంగా ‘పెద్ద మనుషులు’, ఇండస్ట్రీ ‘ప్రముఖులనే’  సునాయాసంగా ఎదుర్కొంటున్న చిన్మయి..  ఓ సగటు యువకుడు చేసిన ఈ అసభ్యకర కామెంట్‌ను చాలా తేలికగా తీసుకున్నారు. ‘ఇవిగో ఇవే నా ఫేవరెట్‌ న్యూడ్స్‌’ అంటూ లిప్‌స్టిక్‌ ఫొటోలను అతడికి పంపించి చెంప చెళ్లుమనిపించేలా.. చాలా తెలివిగా, హుందాగా సమాధానమిచ్చారు. అయితే అంతటితో అతడిని వదిలేయక.. స్త్రీ పట్ల నీచ భావం కలిగి ఉన్న సదరు యువకుడిని..‘ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం’  అంటూ నెటిజన్లకు పరిచయం చేశారు. దీంతో.. ‘చాలా తెలివైన సమాధానం మేడమ్‌.. అటువంటి పశువులకు కనీసం మీ ఉద్దేశం అర్థం అయి ఉండదేమో.. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. హ్యాట్సాఫ్‌’ అంటూ చిన్మయిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. కాగా హ్యూమన్‌ స్కిన్‌ టోన్స్‌కు మ్యాచ్‌ అయ్యే కలర్‌లో ఉండే లిప్‌స్టిక్‌లను న్యూడ్‌ లిప్‌స్టిక్స్‌గా వ్యవహరిస్తారు. దాదాపు ఇందులో 20 నుంచి 30 వరకు షేడ్లు ఉంటాయి.

కాగా ఇండియాలో బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే.18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top