‘ఉంగరం కూడా లేదనే బాబు ఆక్కడ ఇళ్లు ఎలా కట్టారు’

YSRCP MLA  RK Roja Slams On Chandrababu Naidu In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: చిన్నమెదడు చితికిపోయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో గురువారం  ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుది ప్రజా చైతన్య యాత్ర కాదని.. ప్రజలు ఛీ కొట్టిన యాత్ర అని విమర్శించారు. బాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఎస్‌ఆర్‌ఎమ్‌ యూరివర్శిటీ పారిశ్రామిక సమ్మిట్‌కు హాజరైతే టీడీపీ గుండాలు అడ్డుగుని, అసభ్యపదజాలతో నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. రాజధాని రైతులు చంద్రబాబును కొట్టాలని, రాజధానిని ఎందుకు నిర్మించలేదని ఆయనను నిలదీయాలని పేర్కొన్నారు. శాసనసభ కూడా అమరావతిలో ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తున్నారన్నారు. ఒక సామాజిక వర్గం కోసం చంద్రబాబు దాపత్రయ పడుతున్నారన్నారని పేర్కొన్నారు. ఇక సొంత మామా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోడిచిన వ్యక్తి.. రాజధాని రైతులకు వెన్నుపోటు పొడవడన్న నమ్మకం ఎంటని ప్రశ్నించారు.

ప్రజా చైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర

ఇక తన అవినీతి నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని రోజా విమర్శించారు. గడియారం, ఉంగరం లేదని చెప్పే చంద్రబాబు రెండు వందల కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టారని ప్రశ్నించారు. ముందు హైదరాబాద్‌లో కట్టిన ఇల్లుకు లెక్క చెప్పాలని, బాబు తన నివాసంలోకి ఎందుకు ఎవ్వరిని రానివ్వడం లేదన్నారు. ఎప్పుడో కొన్న మార్కెట్ రేట్లు చెబుతూ ఆస్తుల ప్రకటన అంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయో తెలుస్తుందని.. ఇక మళ్ళీ ప్రత్యేకంగా ఆస్తులు ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. బాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారని, బ్రాండ్ గురించి మాట్లాడుతూ మద్యాన్ని ప్రోత్సహించే విధంగా బాబు మాటలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక 2019 ఎన్నికలను బాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 9 నెలల పాలన అద్భుతాలు సృష్టిస్తున్నాయని రోజా పేర్కొన్నారు.

‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top