‘ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది’ | YSRCP MLA Ragurami Reddy Comments on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది’

Jun 3 2018 3:12 PM | Updated on Oct 20 2018 4:47 PM

YSRCP MLA Ragurami Reddy Comments on Chandrababu Naidu - Sakshi

రఘురామిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, వైఎస్సార్‌ కడప : నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లా లేవని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌ బాబు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలపై ఆ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘రాష్ట్రంలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్షలకు దిగారో సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించాలి. కడప జిల్లాకు ఏం సాధించారని చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్నారు. అధికారులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని హామీలు అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కచ్చితంగా ఆత్మ క్షోభిస్తుంది.

అందరిని మోసం చేసే వ్యక్తి చంద్రబాబు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ తనను మోసం చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. గత జన్మభుమికి చేసిన ఖర్చులకు సంబంధించిన నిధులను ఇంతవరకు మంజూరు చేయలేదు. తిరిగి నవనిర్మాణ దీక్షలు చేస్తూ నిధులను వృథా చేస్తున్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మొదటి నుంచి విశ్వసనీయత గల రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు మాదిరి దొంగ నాటకాలు ఆడటం లేదంటూ’ రఘురామిరెడ్డి, సురేష్‌ బాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement