బ్రాహ్మణులంటే బాబుకు లెక్కలేదు: కోన

YSRCP MLA Kona Raghupathi Slams Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్‌ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వ పోకడ చూస్తుంటే చంద్రబాబుకు బ్రాహ్మణులంటే లెక్కేలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్యానించారు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐవైఆర్‌ కృష్ణారావు లాంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని బయటకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంలో చూశామన్నారు. రమణ దీక్షితులు లాంటి ఆగమ శాస్త్ర పండితులను అన్యాయంగా టీడీపీ ప్రభుత్వం బయటకు పంపించిందని విమర్శించారు. చంద్రబాబు దయవల్ల ఈ రోజు ఎన్నికలు క్యాష్‌, కాస్ట్‌ ఉంటేనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 

బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ సమావేశం
ఈ నెల 10న మధ్యాహ్నాం 2 గంటలకు సిరిపురం విజ్ఞాన్‌ స్కూల్‌ గ్రౌండ్స్‌లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం ఉంటుందని, దీనికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని కోన రఘుపతి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ చేయబోయే అంశాల మీద సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top