చంద్రబాబు అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారు | YSRCP Leaders Gautham Reddy And Nagarjuna Slams TDP Government In Vijayawada | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారు

Aug 26 2018 12:11 PM | Updated on Aug 26 2018 12:11 PM

YSRCP Leaders Gautham Reddy And Nagarjuna Slams TDP Government In Vijayawada - Sakshi

వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతం రెడ్డి(పాత చిత్రం)

వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమయ్యాయి..ఇండస్ట్రియల్‌ హబ్స్‌ ఎక్కడ అని సూటిగా అడిగారు.

విజయవాడ: రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతం రెడ్డి విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మేరుగు నాగార్జునతో కలిసి మాట్లాడారు. అడ్డగోలు దోపిడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు తెరతీశారని, సెంట్రలైజ్డ్‌ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమయ్యాయి..ఇండస్ట్రియల్‌ హబ్స్‌ ఎక్కడ అని సూటిగా అడిగారు. చంద్రబాబు అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితం అగమ్యగోచరంగా మారిందని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే కార్మికులు, శ్రామికులకు అండగా ఉంటారని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..చంద్రబాబు కేంద్రంపై యుద్ధం అంటున్నారు...ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ఇదో కొత్త డ్రామా అని అభివర్ణించారు. ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ నేతలు గంగిరెద్దుల వేషం వేసుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసగించడమే చంద్రబాబు నైజమని తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబూ నీ ఆటలు ఇక చెల్లవని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement