జగన్‌పై హత్యాయత్నం ప్రభుత్వ కుట్రే | YSRCP Leaders Blames TDP Over Attack On YS Jagan | Sakshi
Sakshi News home page

Oct 28 2018 3:47 AM | Updated on Oct 28 2018 3:47 AM

YSRCP Leaders Blames TDP Over Attack On YS Jagan - Sakshi

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక అధికార టీడీపీ ప్రభుత్వం కుట్ర ఉందని తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.శివకుమార్‌ అన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ శనివారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహనికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శివకుమార్‌ మాట్లాడుతూ, జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే హత్యాయత్నం చేశారని అన్నారు.

డీజీపీ పూర్తిగా దర్యాప్తు చేయకుండానే చంద్రబాబు మాటలను వల్లె వేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తనిఖీలు చేసినప్పుడు లేని 10 పేజీల పత్రాలు ఎవరు సృష్టించారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తక్షణమే ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించి నిజానిజాలను తేల్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యులు ఎస్‌.భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాదిరెడ్డి భగవంతరెడ్డి, రాష్ట్ర యూత్‌ అధ్యక్షులు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement